- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sam Pitroda: నా సర్వర్లు హ్యాక్ అయ్యాయి.. క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేస్తున్నారు
‘నా సర్వర్లు హ్యాక్ అయ్యాయి.. క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేస్తున్నారు’ అని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడా (Sam Pitroda) పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ‘నా సర్వర్లు హ్యాక్ అయ్యాయి.. క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేస్తున్నారు’ అని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడా (Sam Pitroda) పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా తన ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్ అయ్యాయని తెలిపారు. క్రిప్టో కరెన్సీ రూపంలో పది వేల డాలర్లు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. కొన్ని వారాలుగా తన సర్వర్ కూడా హ్యాక్ అవుతోందని వెల్లడించారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే తన ప్రతిష్ఠ దెబ్బతీస్తామని సైబర్ నేరాగాళ్లు హెచ్చరించారని సామ్ మీడియాక తెలిపారు. తన పేరుతో ఎలాంటి మెయిళ్లు, సందేశాలు వచ్చినా ఎవరూ స్పందించవద్దని.. లింక్‌లను క్లిక్ చేయవద్దని ఆయన తన సన్నిహితులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘సైబర్ నేరగాళ్లు నా ఫోన్, ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేశారు. ఏదైనా తెలియని మెయిల్/మొబైల్ నంబర్ నుంచి నా పేరుతో మెసేజ్‌లు వస్తే ఎవరూ వాటిని ఓపెన్ చేయవద్దు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల వాటిని వెంటనే బ్లాక్ చేయడానికి వీలులేదు. చికాగోకు వచ్చాక ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటాను. దీనివల్ల మీకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాను’’ అని శామ్ పిట్రోడా పేర్కొన్నారు.






