- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Rushdie : సల్మాన్ రష్దీపై దాడి కేసు.. నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ(Salman Rushdie)పై 2022లో జరిగిన దాడి కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ(Salman Rushdie)పై 2022లో జరిగిన దాడి కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన హదీ మాతర్(Hadi Matar) కు న్యూయార్క్(NewYark)లోని చౌటాక్వా కౌంటీ కోర్టు నేడు ఈ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆగస్టు 12, 2022న న్యూయార్క్‌లోని చౌటాక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో రష్దీ రచయితల భద్రత గురించి ఉపన్యాసం ఇవ్వబోతుండగా.. మాతర్ వేదికపైకి దూసుకెళ్లి ఆయనను తల, మెడ, ఛాతీ, కడుపు, కుడి కన్ను, చేతిలో 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో రష్దీ కుడి కంటి చూపు కోల్పోయి, కాలేయం, పేగులు, చేతిలో నరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ఇంటర్వ్యూయర్ హెన్రీ రీస్‌కు కూడా నెత్తిమీద గాయమైంది. ఫిబ్రవరి 2025లో మాతర్‌ను హత్యాయత్నం, దాడి ఆరోపణలపై జ్యూరీ దోషిగా తేల్చింది. రష్దీ ఈ విచారణలో "నేను చనిపోతున్నానని అనిపించింది" అని వివరించారు.
శిక్ష విధించే ముందు మాతర్.. రష్దీని వాక్ స్వాతంత్ర్యంపై "ద్వంద్వ వైఖరి" కలిగిన వ్యక్తిగా విమర్శించాడు. ఈ దాడి వెనుక 1989లో ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖొమైనీ ఫత్వా కారణమని తేల్చారు. రష్దీ రచించిన "ది సాతనిక్ వెర్సెస్"(The Satanic Verses) నవలను అవమానకరంగా భావించిన ఖొమైనీ.. ఆయనను చంపాల్సిందిగా ఆదేశిస్తూ ఫత్వా జారీ చేశాడు. మాతర్, న్యూజెర్సీకి చెందిన అమెరికన్-లెబనీస్ ద్వంద్వ పౌరుడు. ఖొమైనీ ఫత్వాను హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా 2006లో సమర్థించినట్లు నమ్మినట్లు విచారణలో తెలిపాడు.
కాగా రష్దీ దాదాపు 17 రోజులు పెన్సిల్వేనియా ఆసుపత్రిలో, మూడు వారాల పాటు న్యూయార్క్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందారు. ఈ అనుభవాన్ని 2024లో విడుదలైన తన జ్ఞాపకాల పుస్తకం "నైఫ్: మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్"(Knife : Meditations After an Attempted Murder)లో వివరించారు. మాతర్‌పై హిజ్బుల్లాకు మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి ఫెడరల్ ఆరోపణలతో బఫెలోలో మరో ప్రత్యేక విచారణ జరగనుంది. ఇందులో దోషిగా తేలితే మరోసారి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది.






