- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు బ్రేక్.. దీపావళి వేళ దేశంలో రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు
దీపావళి వేళ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఏకంగా రూ.6.05 కోట్ల లక్షల వ్యాపారం జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో ఈ ఏడాది రికార్డు క్రియేట్ అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: దీపావళి వేళ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఏకంగా రూ.6.05 కోట్ల లక్షల వ్యాపారం జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో ఈ ఏడాది రికార్డు క్రియేట్ అయ్యింది. ఈ విషయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఇక గతేడాది రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరగ్గా.. ఈ ఏడాది 25 శాతం పెరిగిందని సీఏఐటీ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా 87శాతం మంది స్వదీశీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారని అన్నారు. దీంతో చైనా ప్రోడక్టులకు డిమాండ్ తగ్గిందని చెప్పారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. దీపావళికి కొత్త దుస్తులతో పాటు పిండివంటలు చేసుకోవడం, క్రాకర్స్ కాల్చడం లాంటివి చేస్తుంటారు. అంతే కాకుండా గత కొంతకాలంగా కేంద్రం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీంతో ప్రజలు మెల్లిమెల్లిగా స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు.






