సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశీనా?

by Ajay Maddhiboyina |

సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన దుండగుడిని పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశీనా?
X

- నకిలీ పత్రాలతో భారత్‌లో నివాసం

- అనుమానిస్తున్న పోలీసులు

దిశ, నేషనల్ బ్యూరో:

సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పొరుగు దేశం నుంచి అక్రమంగా చొరబడి.. నకిలీ పత్రాలతో భారతీయుడిగా చలామణి అవుతున్నాడని తెలిసింది. అయితే సదరు వ్యక్తి మాత్రం తాను భారతీయుడినే అని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడినని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన దుండగుడిని పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో థానేలోని లేబర్ క్యాంప్ ఏరియాలో ఉన్న ఒక పబ్‌లో శనివారం అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి మహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్‌గా గుర్తించారు. బాంద్రాలోని సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల ఇంట్లోకి ప్రవేశించి.. నటుడిపై దాడి చేసింది తానేనని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితుడిని ప్రస్తుతం ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి పలు పేర్లు ఉన్నట్లు గుర్తించారు. ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Next Story