నెత్తికి ఫ్యాన్ బిగించుకుని తిరుగుతున్న సాధువు... నెట్టింట వైరల్ అవుతున్న (వీడియో)

by Dishanational1 |
నెత్తికి ఫ్యాన్ బిగించుకుని తిరుగుతున్న సాధువు... నెట్టింట వైరల్ అవుతున్న (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఎన్నో వింతలు, విచిత్రాలతో కూడిన సన్నివేశాలు, ఫొటోలు, వీడియోల రూపం చూస్తూ ఉంటాం. తాజాగా కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ సాధువు తన నెత్తికే ఫ్యాన్ ను బిగించుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎందుకు ఇలా బిగించావు అని అడుగగా అతను చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని వీధుల వెంట తిరిగుతున్న ఓ సాధువును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఫ్యాక్టరీలలో వాడే హెల్మెంట్ ను నెత్తికి ధరించి, దానికి చిన్న ఫ్యాన్ ను బిగించి, అదేవిధంగా దానికి సోలార్ ప్యానెల్ ను కూడా బిగించాడు. ఆ ఫ్యాన్ నిరంతరం తిరుగుతూనే ఉంది. ఇలా అతడిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ ఆ సాధువును ఇదేంటి.. అని ఆరా తీయగా అతను చెప్పిన ఆన్సర్ విని షాకయ్యారు. తాను వీధుల వెంట తిరుగుతుంటుంటే తాను ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది పడుతున్నానని... ఆ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేశాను అని అతను తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.


Next Story

Most Viewed