- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెల్ బోర్న్‌లో రెచ్చిపోయిన ఖలిస్తానీ వర్గం.. భారతీయులపై దాడులు
ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ సానుకూల వర్గం రెచ్చిపోయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ సానుకూల వర్గం రెచ్చిపోయింది. మెల్ బోర్న్‌లోని ఫెడ్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాలు పట్టుకుని ఉన్న భారతీయులపై దాడులకు పాల్పడ్డారు. దీనిపై భారత్‌లోని ఆస్ట్రేలియన్ హైకమిషనర్ భారీ ఓ ఫరెల్ విచారం వ్యక్తం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా శాంతియుత నిరసనలకు కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ఎలాంటి హింసను సించబోమని చెప్పారు. ఇరు దేశాలు తమ తమ జాతీయ పర్వదినోత్సవాలను జరుపుకున్న వెంటనే ఈ సంఘటన చోటు చేసుకుందని అన్నారు. కాగా, దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ దాడిలో ఐదుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు హిందు దేవాలయాలపై ఖలిస్తానీ రాతలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Next Story






