- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
saajib wajid: బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుంది.. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కుమారుడు సాజిబ్ వాజిద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మరో భవిష్యత్‌లో మరో పాకిస్థాన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. హసీనా ఏ తప్పూ చేయలేదని..కానీ ప్రస్తుత పరిస్థితిని చూసి మాత్రం చాలా నిరాశకు గురయ్యారని తెలిపారు. మంగళవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విద్యార్థుల్లో అశాంతిని రెచ్చగొట్టి పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడంలో పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రమేయం ఉందని తాను అనుమానిస్తున్నట్టు చెప్పారు. దేశ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. దేశంలోని హిందువులు, క్రిస్టియన్లను టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో అత్యుత్తమంగా పరిపాలించింది హసీనానేనని కొనియాడారు. మిలిటెంట్లతో పోరాడినప్పటికీ నిరాశే మిగిలిందన్నారు. వీధుల్లో రక్తపాతాన్ని నివారించేందుకు బంగ్లాశ్‌ను వీడారని స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని భావించారని, అయితే శాంతియుతంగా అధికార మార్పిడిని నిరసనకారులు వ్యతిరేకించారని ఆరోపించారు. ఆందోళన కారులు తమ పార్టీ కార్యకర్తలని టార్గెట్ చేశారని వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో హింస వెనుక సైన్యం ప్రమేయం లేదని స్పష్టం చేశారు.