- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
S Jaishankar: జైశంకర్ కు భద్రత పెంపు.. కాన్వాయ్ లోకి బుల్లెట్ ప్రూఫ్ కారు
పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఇలాంటి పరిణామాల వేళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు కేంద్ర హోంశాఖ భద్రత మరింత పెంచినట్లు సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఇలాంటి పరిణామాల వేళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు కేంద్ర హోంశాఖ భద్రత మరింత పెంచినట్లు సమాచారం. ఢిల్లీలోని ఆయన (S Jaishankar) నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పాటు.. ఓ ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ కారు (Bulletproof Car)ను కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ అధికారిక వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. జైశంకర్‌కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలతో కూడిన జడ్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. ఆయనకు 33 మంది కమాండోల బృందం సెక్యూరిటీ అందిస్తుంది. ప్రస్తుతం ఈ భద్రతతో పాటు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయన కాన్వాయ్‌లో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
2023లోనే జడ్ కేటగిరీ భద్రత
సాధారణంగా హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు ముప్పు పొంచిఉన్న సందర్భాల్లో జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. జైశంకర్‌కు ముప్పు అంచనాలపై గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో 2023 అక్టోబరులో ఆయనకున్న వై కేటగిరీ భద్రతను జడ్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఆయన భద్రతను పెంచడం గమనార్హం. ఆ సమయంలో భద్రతా వివరాలలో భాగంగా కేంద్రమంత్రి నివాసంలో భద్రతాసిబ్బంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు.






