- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: ఉగ్రవాద సంస్థగా టీఆర్ఎఫ్.. అమెరికా ప్రకటనను స్వాగతించిన భారత్
అమెరికా నిర్ణయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం స్వాగతించారు.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న పాకిస్తాన్ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలన్న అమెరికా నిర్ణయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం స్వాగతించారు. ఇది భారత్-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి బలమైన సాక్ష్యమని ఆయన అభివర్ణించారు. టీఆర్ఎఫ్ పూర్తిగా లష్కరే తోయిబాకు ముసుగు సంస్థ. పెహల్గామ్‌లో చాలామంది అమాయకుల ప్రాణాలను ఆ సంస్థ బలి తీసుకుంది. అటువంటి సంస్థను ఎప్పటికీ సహించకూడదన్న అమెరికా అభిప్రాయాన్ని పేర్కొంటూ జైశంకర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతకుముందు పెహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. ఈ దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థ సంస్థగా ప్రకటించింది. టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఉగ్రవాదాన్ని నిరోధించడంలో అమెరికా-భారత మధ్య పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తుంది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. టీఆర్ఎఫ్‌పై ఈ చర్య మా జాతీయ భద్రతా ప్రయోజనాలను రక్షించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు పెహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపును అమలు చేయడంలో అమెరికా ప్రభుత్వ పరిపాలనలో నిబద్దతను సూచిస్తుందన్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందువులే టార్గెట్‌గా చేసిన ఈ దాడిపై అంతర్జాతీయంగా అనేక దేశాలు ఖండించాయి. ఈ ఘటన తర్వాత భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాదుల క్యాంపులను ధ్వంసం చేసింది.






