- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ స్వాగతం పలుకుతారని ఊహించలేదు: రష్యా
మోడీ స్వాగతం పలుకుతారని ఊహించలేదు: రష్యా

దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీ సమీపంలోని పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్వయంగా స్వాగతం పలికారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. అయితే.. పుతిన్‌కు మోడీ స్వయంగా స్వాగతం పలకడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. మోడీ స్వయంగా వెల్‌కమ్ చెబుతారని ఊహించలేదని పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుందని వెల్లడించింది. ఎయిర్‌పోర్టు నుంచి ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణించారు. పుతిన్‌కు మోడీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశం పైనా చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు.






