- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌కు రానున్న రష్యా ప్రెసిడెంట్ పుతిన్.. క్రెమ్లిన్ అధికారిక ప్రకటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరులో భారత్‌కు రానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆయన భారత్ (India)కు రానున్నట్లుగా రష్యా అధ్యక్ష భవనం ‘క్రెమ్లిన్’ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. అయితే, సెప్టెంబరు 12, 13 తేదీల్లో దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకే పుతిన్ భారత్‌కు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు క్రెమ్లిన్ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సుతో పాటు భారత్-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య ఒప్పందాలపై కూడా ఈ పర్యటనలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.






