బ్రిక్స్ దేశాలపై వివక్షాపూరిత సుంకాలను ఖండించిన పుతిన్

by Phanindra |

బ్రిక్స్ దేశాలపై వివక్షాపూరిత సుంకాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఎస్సీవో సమ్మిట్ కోసం చైనాకు వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్రిక్స్ దేశాలపై వివక్షాపూరిత సుంకాలను ఖండించిన పుతిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిక్స్ దేశాల ఎదుగుదలను అడ్డుకునే వివక్షాపూరిత సుంకాలపై రష్యా, చైనాలది ఒకే విధానమని ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎస్సీవో సమావేశం కోసం చైనాలోని టియాంజిన్ చేరుకున్న ఆయన.. ప్రముఖ చైనా వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో బ్రిక్స్ దేశాల పాత్రను బలోపేతం చేయడానికి చైనా, రష్యా కృషి చేస్తాయని తెలిపారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకుల్లో పలు సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అందరికీ అందుబాటులో ఉండే, సదరు దేశాల ఆర్థిక బలాన్ని చూపించే ఆర్థిక శాఖ అవసరమని ఆయన చెప్పారు. బ్రిక్స్ దేశాలు యూఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, వీటిపై 10 శాతం సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులందరికీ లబ్ది చేకూర్చే అభివృద్ధినే తాము కోరుకుంటామని, ఈ క్రమంలోనే తమ తమ దేశాల అభివృద్ధి కోసం కృషి చేస్తాయని పేర్కొన్నారు. సమస్యలను ఎదుర్కోవడంలో బ్రిక్స్ దేశాల సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆశించారు.

Next Story