- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zelensky: జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా క్షిపణి దాడి
రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం మూడేళ్లయినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. శాంతి చర్చలు జరుగుతాయన్న వేళ జెలెన్‌స్కీ (Zelenskyy) స్వస్థలంపై క్షిపణి దాడికి పాల్పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం మూడేళ్లయినా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. శాంతి చర్చలు జరుగుతాయన్న వేళ జెలెన్‌స్కీ (Zelenskyy) స్వస్థలంపై క్షిపణి దాడికి పాల్పడింది. బుధవారం రాత్రి సమయంలో క్రీవి రీహ్‌లోని ఓ హోటల్‌పై రష్యా క్షిపణిదాడిలో ముగ్గురు చనిపోయారు. సుమారు 31 మందికి గాయాలయ్యాయి. ఆ హోటల్‌లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తోంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కీవ్ తో కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే మిలిటరీ, ఇంటెలిజెన్స్ సాయాన్ని నిలిపివేశారు. ఆ తర్వాతే ఈ ఘటన జరగడం గమనార్హం. రష్యా మిసైల్ దాడి జరిగిన క్రీవి రీహ్‌లోనే జెలెన్‌స్కీ జన్మించారు.
అమెరికాలో రసాభాస
అయితే, ఇటీవలే యూఎస్, ఉక్రెయిన్ భేటీ రసాభాసగా జరగడంతో.. ఐరోపా దేశాలు రంగంలోకి దిగాయి. అయితే, ఆ ఘటన తర్వాత మరోసారి అమెరికాతో తాము చర్చలకు సిద్ధమేనని జెలెన్‌స్కీ (Zelenskyy) వెల్లడించారు. అయితే ఈసారి యూఎస్ పర్యటనలో ఆయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా వెళ్లే ఛాన్సెస్ కన్పిస్తున్నాయి. ఆ దిశగానే తమ ఆలోచనలు ఉన్నాయని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. అందరూ కలిసి వెళ్లడం ద్వారా యూరప్ ఐక్యత చాటుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.






