- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Russian Chef: పుతిన్‌ను తీవ్రంగా విమర్శించిన రష్యా సెలబ్రిటీ చెఫ్ అనుమానాస్పద మృతి
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శతృవులు, ప్రముఖులు అనూహ్యంగా అదృశ్యమవడం, మరణించడం గత కొన్నేళ్ల చర్చల్లో ఉంటున్నాయి. ఈ జాబితాలో తాజాగా యూకేకు చెందిన రష్యన్ సెలబ్రిటీ చెఫ్ అలెక్సీ జిమిన్ కూడా చేశారు. ఇటీవల ఆయన అనుమానాస్పద రీతిలో హోటల్‌లో శవమై కనిపించాడు. అతని మరణానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయి. టీవీ యాంకర్, వంటల కార్యక్రమాలను నిర్వహించే జిమిన్ కొన్నేళ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తున్నాడు. 2014లో ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఆ ఏడాదిలేనే అతను దేశం విడిచి లండన్ పారిపోయి, జీమా పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. రష్యా మీడియా కథనాల ప్రకారం బెల్‌గ్రేడ్ అనే హోటల్‌లో జిమిన్ చనిపోయి ఉండటం గుర్తించారు. మరణానికి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని సెర్బియా అధికారులు వెల్లడించారు.