ఉక్రెయిన్‌ జైలుపై రష్యా ఎయిర్ స్ట్రైక్.. 17 మంది ఖైదీల మృతి, 80 మందికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-29 07:50:34  IST  )

ఎయిర్ స్ట్రైక్‌ (Air Strike) కారణంగా 17 మంది దుర్మరణం పాలైన ఘటన ఉక్రెయిన్‌ (Ukraine) చోటుచేసుకుంది.

ఉక్రెయిన్‌ జైలుపై రష్యా ఎయిర్ స్ట్రైక్.. 17 మంది ఖైదీల మృతి, 80 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ స్ట్రైక్‌ (Air Strike) కారణంగా 17 మంది దుర్మరణం పాలైన ఘటన ఉక్రెయిన్‌ (Ukraine) చోటుచేసుకుంది. ఆగ్నేయ జపోరిజ్జియా (South-Eastern Zaporizhian) ప్రాంతంలోని ఓ జైలుపై రష్యా బలగాలు (Russia Forces) సోమవారం రాత్రి ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దుర్ఘటనలో 17 మంది ఖైదీలు మృతి చెందగా.. 80 మందికి పైగా గాయపడినట్లుగా ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. జపోరిజ్జియా జైలుపై రెండు ఇస్కాందర్-M బాలిస్టిక్ క్షిపణులతో పాటు 37 షహేద్ వేరియంట్ దాడి డ్రోన్లు, డికాయ్ యూఏవీలను రష్యా ప్రయోగించింది. 32 షహేద్ డ్రోన్‌లను ప్రయోగించగా ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఈ ఆకస్మిక దాడితో జైలులోని భోజనశాల, అడ్మినిస్ట్రేషన్ భవనం, క్వారంటైన్ బిల్డింగ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే, జైలు చుట్టూ భారీ ప్రహరీ గోడ ఉండటంతో ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని జైలు అధికారులు తెలిపారు.

Next Story