Russia: రష్యాకు ఆఫర్ ఇచ్చిన జెలెన్ స్కీ. ఎప్పటికీ ఒప్పుకోబోమన్న క్రెమ్లిన్

by Shamantha N |

రష్యా (Russia)తో భూమి మార్పిడికి తాము సిద్ధమన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ (Zelenskyy) పేర్కొన్నారు. ఇరుదేశాల్లోని ప్రాంతాలను ఇచ్చి పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Russia: రష్యాకు ఆఫర్ ఇచ్చిన జెలెన్ స్కీ. ఎప్పటికీ ఒప్పుకోబోమన్న క్రెమ్లిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా (Russia)తో భూమి మార్పిడికి తాము సిద్ధమన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ (Zelenskyy) పేర్కొన్నారు. ఇరుదేశాల్లోని ప్రాంతాలను ఇచ్చి పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, రష్యా అధీనంలోని ఉక్రెయిన్‌ భూభాగాలను విడిచిపెడితేనే తమ అధీనంలో ఉన్న కుర్స్క్‌ను వారికి అప్పగిస్తామని షరతు పెట్టారు. కాగా.. క్రెమ్లిన్ దగ్గరున్న ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అని చెప్పుకొచ్చారు. ఏవి తిరిగి స్వాధీనం చేసుకోవాలనే విషయంపై చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అలా జరగాలంటే రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కృషి చేయాలని కోరారు.

జెలెన్ స్కీ ఆఫర్ తిరస్కరించిన రష్యా

ఇకపోతే, జెలెన్ స్కీ ఆఫర్ ని రష్యా కొట్టిపారేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ప్రాంతాలను ఇచ్చిపుచ్చుకునే ఆఫర్ ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. భూ మార్పిడి గురించి క్రెమ్లిన్ ఎప్పటికీ చర్చిందని అన్నారు. "ఇది అసాధ్యం" అని మీడియాతో అన్నారు. రష్యా ఉక్రెయిన్ తో భూభాగ మార్పిడి గురించి ఎప్పుడూ చర్చించదు, చర్చించబోదన్నారు. ఉక్రేనియన్ దళాలను కుర్క్స్ భూభాగం నుండి తరిమేయడమో లేదా నాశనం చేయడమో చేస్తామన్నారు. రష్యా ఉక్రెయిన్‌లో 20 శాతం కంటే తక్కువగా.. 1,12,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నియంత్రిస్తుంది. అయితే, ఉక్రెయిన్ కుర్క్స్ లోని కేవలం 450 చదరపు కిలోమీటర్లనే స్వాధీనం చేసుకుందన్నారు. ఇదంతా ఓపెన్ సోర్స్ మ్యాప్ లే చెబుతున్నాయన్నారు. గతంలో పుతిన్ మాట్లాడుతూ.. కుర్క్స్ నుంచి ఉక్రెయిన్ దళాలను కచ్చితంగా తరిమేస్తామన్నారు. కానీ, అది ఎప్పుడు జరుగుతుందో చెప్పేందుకు నిరాకరించారు. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఆతర్వాత డోనెస్క్‌, ఖేర్సన్‌, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై మాస్కోకు పూర్తి నియంత్రణ లేదు.

Next Story