- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాకు షాకిచ్చిన రష్యా
అగ్రరాజ్యం అమెరికాకు (America) రష్యా (Russia) షాకిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాకు (America) రష్యా (Russia) షాకిచ్చింది. 1987లో రష్యా అమెరికాతో చేసుకున్న ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF) ఒప్పందం నుంచి బయటకు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. 'పశ్చిమ దేశాల చర్యలు తమ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా మారాయి' అని పేర్కొంటూ, ఈ ఒప్పందాన్ని కొనసాగించే పరిస్థితులు ఇప్పుడు లేవని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా తన టైఫాన్ మిస్సైల్ లాంచర్‌ను ఫిలిప్పీన్స్‌లో ఉంచడం, అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన టలిస్మాన్ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం వంటి చర్యలే ఈ నిర్ణయానికి దారితీశాయని పేర్కొంది. మరోవైపు ట్రంప్ చర్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. ఇటీవలే రష్యా (Russia) మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ ప్రకటనకు స్పందనగా.. రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు.
ఇక 1987లో అమెరికా (USA) అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, రష్యా (Russia) అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం.. 500 నుంచి 5,500 కిలోమీటర్ల పరిధిలో గ్రౌండ్-లాంచ్ మిసైళ్లు నిషేధించబడ్డాయి. అయితే 2019లో అమెరికా రష్యా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ ఒప్పందం నుంచి బయటపడింది. మాస్కో ఆ ఆరోపణలను ఖండిస్తూ, అమెరికానే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మిస్సైళ్లను అభివృద్ధి చేస్తోందని ఆరోపించింది. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఒప్పంద పతనం వల్ల ప్రపంచ భద్రతా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఈ వారంలో మాస్కోకు వెళ్లనుండగా, దీనిపై ఆగస్టు 9నాటికి తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. INF ఒప్పందం నుంచి రష్యా బయటపడటంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది.






