- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ దాడి..14 మంది మృతి
శాంతి ఒప్పందం కుదిరే వరకు ఆంక్షలు, సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: శాంతి ఒప్పందం కుదిరే వరకు ఆంక్షలు, సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యాకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యా మరోసారి ఉక్రెయిన్ (Ukrein) పై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. డొనెట్స్క్ ప్రాంతంలోని డోబ్రోపిలియా (Dobropilia), బొగోడుఖివ్ నగరాలపై అటాక్ చేసింది. ఈ ఘటనల్లో ఐదుగురు పిల్లలు సహా14 మంది మరణించగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు ఖార్కివ్ ప్రాంత సైనిక ఉన్నతాధికారి ఒలేగ్ సైనెగుబోవ్ తెలిపారు. బొగోడుఖివ్‌పై రష్యా రెండు క్షిపణులు, 145 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఖార్కివ్ ప్రాంతంలోనూ దాడులు జరగగా ఆ ప్రాంతంలో మరో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంక్షలు విధించాలి: జెలెన్ స్కీ
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) స్పందించారు. మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. ‘ఇటువంటి దాడులు రష్యా లక్ష్యాలు మారలేదని చూపిస్తున్నాయి. అందువల్ల, ప్రాణాలను రక్షించడానికి, వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి రష్యాపై ఆంక్షలను పెంచాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యం’ అని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు (Puthin) ఆర్థిక సాయం చేసేందుకు దోహదపడే ప్రతి పరిణామాన్ని ముగించాలని సూచించారు. శాంతిని కోరుకునే భాగస్వాములతో తాము కలిసి పని చేస్తూనే ఉంటామని తెలిపారు. మరోవైపు అమెరికా, ఉక్రెయిన్ చర్చలు వచ్చే వారం సౌదీ అరేబియా (Soudi arebiya) లో జరగనున్నాయి.
Read More ....
T-72 tank: రష్యాతో భారత్ భారీ ఒప్పందం.. ఎందుకంటే?






