Russia: ఉక్రెయిన్‌పై 352 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా.. తొమ్మిది మంది మృతి

by B.Srinivas |

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ లో డ్రోన్లు, క్షిపణులతో అటాక్ చేసింది.

Russia: ఉక్రెయిన్‌పై 352 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా.. తొమ్మిది మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌ (Ukrein) పై రష్యా (Russia) మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్‌లో డ్రోన్లు (Drones), క్షిపణులతో అటాక్ చేసింది. నివాస ప్రాంతాలు, ఆస్పత్రులు, క్రీడా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా డజనుకు పైగా ప్రజలు గాయపడ్డారు. మొత్తం 352 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమాణిక దళం తెలిపింది. అలాగే 11 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు క్రూయిజ్ క్షిపణులతోనూ దాడి చేసిందని పేర్కొంది. అయితే 339 డ్రోన్లు, 15 క్షిపణులను తమ దళాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) ధ్రువీకరించారు. కీవ్‌లో ఆరుగురు, మిగతా ప్రాంతాల్లో మరో ముగ్గురు మరణించారని తెలిపారు. రష్యాపై దాడులను తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెక్సాండర్ సిర్స్కీ ప్రతిజ్ఞ చేసిన మరుసటి రోజే రష్యా విరుచుకుపడటం గమనార్హం.

Next Story