Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. 273 డ్రోన్లతో దాడి

by B.Srinivas |

రష్యా ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా 273 డ్రోన్లతో దాడి చేసింది.

Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. 273 డ్రోన్లతో దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein)ల మధ్య చర్చలు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా 273 డ్రోన్లతో దాడి చేసింది. కీవ్, డ్నిప్రోపెట్రోవ్, డొనెట్స్క్ సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులకు పాల్పడింది. వీటిలో ఉక్రేనియన్ వైమానిక రక్షణ దళం 88 డ్రోన్లను అడ్డుకుంది. అలాగే 128 డ్రోన్లను ధ్వంసం చేసింది. ఈ దాడుల వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పలు నివాస భవనాలు సైతం దెబ్బతిన్నట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. కాగా, ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌పై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ఒకేసారి 267 డ్రోన్లను ప్రయోగించింది. అయితే కాల్పుల విరమణ సహా పలు అంశాలపై ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ రష్యా దాడులకు పాల్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story