Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. 598 డ్రోన్లు, 31క్షిపణుల ప్రయోగం

by B.Srinivas |

రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. కీవ్‌పై గురువారం బాంబుల మోత మోగించింది.

Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా..  598 డ్రోన్లు, 31క్షిపణుల ప్రయోగం
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా (Russia) మరోసారి ఉక్రెయిన్ (Ukrein) పై విరుచుకుపడింది. కీవ్‌పై గురువారం బాంబుల మోత మోగించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమాణిక దళం తెలిపింది. ఈ దాడిలో ముగ్గురు పిల్లలు సహా 14 మంది మరణించగా 48 మంది గాయపడ్డారు. అలాగే పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలు, వైమానిక స్థావరాలు, ఒక నిఘా నౌకను లక్ష్యంగా చేసుకున్నట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి అమెరికా శాంతి ప్రయత్నాలు చేస్తున్న వేళ రష్యా అటాక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తాజా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) సహా పలు దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. రష్యా చర్చలకు బదులుగా మిసైల్స్ ఎంచుకుంటుందని జెలెన్ స్కీ ఫైర్ అయ్యారు. ప్రపంచ శాంతి కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు సైతం దాడులను ఖండించారు.

Next Story