- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: భారత ఫార్మా గిడ్డంగిపై రష్యా దాడి.. వెల్లడించిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత ఔషధ సంస్థకు చెందిన కుసుమ్ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసినట్టు ఇండియాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ (Ukrein) రాజధాని కీవ్‌లోని భారత ఔషధ సంస్థకు చెందిన కుసుమ్ గిడ్డంగిపై రష్యా (Russia) క్షిపణి దాడి చేసినట్టు ఇండియాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యాతో భారత్‌కు ప్రత్యేక స్నేహం ఉన్నప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే దాడికి పాల్పడినట్టు పేర్కొంది. ‘ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా గిడ్డంగిని రష్యా క్షిపణి ఢీకొట్టింది. భారతదేశంతో ప్రత్యేక స్నేహం అని చెప్పుకుంటూనే ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంది. పిల్లలు, వృద్ధుల కోసం నిల్వ ఉంచిన మెడిసిన్‌ను నాశనం చేస్తోంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే ఉక్రెయిన్ వ్యాఖ్యలపై రష్యా, భారత్‌లు స్పందించలేదు. మరోవైపు ఉక్రెయిన్‌లోని యూకే రాయబారి మార్టిన్ హారిస్ మాట్లాడుతూ.. రష్యా దాడిలో కీవ్‌లోని ప్రధాన ఔషధ గిడ్డంగి ధ్వంసమైందని తెలిపారు. కానీ ఆ కంపెనీ ఇండియాదా కాదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిరోధించడానికి రష్యా, ఉక్రెయిన్ ఇటీవల తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే.






