రష్యాలో -56 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత

by Muthe.Rajitha |   (  Updated:2025-12-25 06:51:46  IST  )

రష్యాలోని సఖా రిపబ్లిక్ (యాకుటియా) ప్రాంతంలో తీవ్రమైన చలి వణికిస్తోంది.

రష్యాలో -56 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యాలోని సఖా రిపబ్లిక్ (యాకుటియా) ప్రాంతంలో తీవ్రమైన చలి వణికిస్తోంది. అక్కడ ఇటీవల ఉష్ణోగ్రతలు మైనస్ 56 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. ఇది భూమిపై నివాసిత ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతగా నిపుణులు పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని టిక్సీ గ్రామంలో మూడు రోజులుగా భారీ మంచు తుఫాను వీస్తోంది. దీనివల్ల పాఠశాలలు, కిండర్‌గార్టెన్‌లు మూసివేశారు. ఇళ్ల ముందు మంచు పేరుకుపోవడంతో చాలా మంది బయటకు రావలేక ఇళ్లలోనే ఉంటున్నారు. బలమైన గాలులు, మంచు కారణంగా బయట తిరగడం చాలా కష్టం అయ్యింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల వరకు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. యాకుటియా ‘పోల్ ఆఫ్ కోల్డ్’గా ప్రసిద్ధి అయిన ప్రాంతమే అయినా, ఈసారి చలి తీవ్రత మరింత అధికంగా ఉంది.

Next Story