- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: అమెరికా ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధం.. ట్రంప్ ప్రకటనపై రష్యా ఫైర్
by B.Srinivas |
50 రోజుల్లోపు యుద్ధాన్ని ఆపకపోతే 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికలపై రష్యా స్పందించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపకపోతే 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన హెచ్చరికలపై రష్యా స్పందించింది. అదనపు ఆంక్షలను తట్టుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీయ్ లావ్రోవ్ (Lavrov) తెలిపారు. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని తెలిపారు. రష్యా ఇప్పటికే అనేక ఆంక్షలను ఎదుర్కొంటుందని, ఈ క్రమంలోనే కొత్త భారాలను తట్టుకోగల సామర్థ్యం తమకు ఉందన్నారు. అమెరికాను ఎదుర్కొంటామనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకునే ఇరాన్ చట్టబద్ధమైన హక్కుకు ఎస్సీవో దేశాలు మద్దతును వ్యక్తం చేశాయని తెలిపారు.
Next Story






