- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Russia: భారత గిడ్డంగిపై దాడి చేయలేదు.. ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించిన రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత ఔషధ గిడ్డంగి కుసుమ్‌పై రష్యా దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ (Ukrein) రాజధాని కీవ్‌లోని భారత ఔషధ గిడ్డంగి కుసుమ్‌పై రష్యా (Russia) దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. కీవ్ తూర్పు ప్రాంతంలోని కుసుమ్ హెల్త్‌కేర్ ఫార్మసీ గిడ్డంగిపై తాము అటాక్ చేయలేదని, దాడి చేయడానికి ఎటువంటి ప్రణాళికలు సైతం వేయలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ క్షిపణులే ఫార్మా గిడ్డంగిపై పడి ఉండొచ్చని, అందుకే భారీగా మంటలు చెలరేగాయని రష్యా రాయబార కార్యాలయం ఆరోపించింది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్లు తమ లక్ష్యాలను చేధించడంలో విఫలమవుతున్నాయి, ఆ టైంలో అసమర్థంగా పనిచేసే ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థల కారణంగా పట్టణ ప్రాంతాల్లో క్షిపణులు పడిపోయిన ఇలాంటి సందర్భాలు గతంలోనూ అనేకం ఉన్నాయని తెలిపింది.
Next Story






