ట్రంప్ బెదిరింపులపై రియాక్టయిన రష్యా మాజీ ప్రెసిడెంట్!

by Phanindra |

ఇరాన్‌కు చాలాదేశాలు అణ్వాయుధాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఆయన బెదిరింపులపై రష్యా మాజీ ప్రెసిడెంట్ రియాక్టయ్యారు.

ట్రంప్ బెదిరింపులపై రియాక్టయిన రష్యా మాజీ ప్రెసిడెంట్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రంప్ వ్యాఖ్యలపై ప్రస్తుత రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదేవ్ స్పందించారు. ఇరాన్‌పై యూఎస్ దాడులను తాను ఖండించానని, ఈ దాడులు తమ లక్ష్యాన్ని సాధించలేదని అన్నారు. అయితే ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇచ్చే ఆలోచన రష్యాకు ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. ‘ఎందుకంటే.. మేం ఇజ్రాయెల్‌లా కాదు. న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీలో మేం భాగస్వాములం. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా న్యూక్లియర్ దళాలను చూశాను కాబట్టి.. ఈ ఒప్పందం అర్థం ఏంటో నాకు బాగా తెలుసు.

కానీ మిగతా దేశాలు అలా కాదు కదా. వాళ్లు ఇరాన్‌కు అణ్వాయుధాలు ఇవ్వొచ్చు. అదే మాట నేను చెప్పాను. అలాగే ఎవరి దగ్గర ఎక్కువ అణ్వాయుధాలున్నాయని దెబ్బలాడుకునే సమయం ఇది కాదు. ఒకానొక టైంలో యూఎస్ ప్రెసిడెంట్‌తో నేను స్టార్ట్ (START) ఒప్పందం చేసుకున్నాను. అది ఇంకా అమల్లో ఉంది కాబట్టి అసలు అణ్వాయుధాల గురించి వాదించుకోవడం అనవసరం’ అని మెద్వెదేవ్ పేర్కొన్నారు.

Next Story