ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులు.. 36 మిసైల్స్‌ను ప్రయోగించిన రష్యా

by Disha Web Desk 13 |
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులు.. 36 మిసైల్స్‌ను ప్రయోగించిన రష్యా
X

కీవ్: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులతో రెచ్చిపోయింది. గురువారం 36 మిసైల్స్‌ను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిలో 16 మిసైల్స్ ను నేల కూల్చినట్లు చెప్పారు. రష్యా దాడిలో ఓ 79 ఏళ్ల వృద్ధురాలు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు చెప్పారు. తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో రష్యా తన ప్రణాళికలు మార్చినట్లు పేర్కొన్నారు.

ఈ క్షిపణి దాడుల్లో 30కి పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు. మరోవైపు యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి కోరింది. ఉక్రెయిన్ నుంచి రష్యా తమ దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణంగా 'సాధ్యమైనంత త్వరగా, సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని చేరుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే ముసాయిదా తీర్మానం పై వచ్చే వారం ఐరాస జనరల్ అసెంబ్లీ ఓటింగ్ నిర్వహించనుంది. అంతకుముందు రష్యాకు చెందిన ఆరు అనుమానిత బెలూన్లను ఉక్రెయిన్ మిలిటరీ కూల్చివేసింది.


Next Story

Most Viewed