- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి.. 30 మంది మృతి !
రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా అనేక మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. షోస్ట్కా నుంచి కీవ్‌కు వెళ్తున్న ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకుని ఈ అటాక్‌కు పాల్పడినట్టు స్థానిక గవర్నర్ ఓలేల్ ప్రిహోరోవ్ తెలిపారు. దాడి అనంతరం ఓ కోచ్ పూర్తిగా కాలిపోయినట్టు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. అకస్మాత్తుగా ట్రైన్ పై డ్రోన్ పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) స్పందించారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ప్రతిరోజూ రష్యా ప్రజల ప్రాణాలను తీస్తుందని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతకుముందు రోజు ఉక్రెయిన్ విద్యుత్ నెట్‌వర్క్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.
కాగా, రష్యా ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాల మధ్య పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ శాంతియుత పరిస్థితులు నెలకొనలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశమయ్యారు. అయినప్పటికీ కాల్పుల విరమణ, శాంతి దిశగా అడుగులు పడలేదు. ఈ క్రమంలోనే మరోసారి దాడులు జరగడం గమనార్హం.






