- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లలో ఎస్-400ల డెలివరీలు పూర్తి.. మాటిచ్చిన రష్యా రక్షణ మంత్రి!
రెండేళ్లలో ఎస్-400ల డెలివరీలు పూర్తి చేస్తామని రాజ్‌నాథ్ సింగ్‌కు రష్యా రక్షణ మంత్రి మాటిచ్చినట్లు సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు అందించాల్సిన చివరి రెండు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల డెలివరీని వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని రష్యా హామీ ఇచ్చింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశం కోసం చైనాలోని కింగ్‌డావోకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసవ్‌ను ఆయన కలిశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్లనే ఎస్-400 వ్యవస్థల డెలివరీ ఆలస్యమైందని బెలోసవ్ వివరించినట్లు సమాచారం.
రష్యా నుంచి ఐదు ఎస్-400 ట్రయంఫ్ వ్యవస్థలను భారత్ ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఇప్పటి వరకు మూడు డెలివర్ అయ్యాయి. నాలుగోది 2026లో, చివరిది 2027లో భారత్‌కు అందజేస్తామని రాజ్‌నాథ్ సింగ్‌కు బెలోసవ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో ఒక ఎస్-400ను భారత్ ఉపయోగించింది. పాకిస్తాన్ చేసిన మిసైల్, డ్రోన్ దాడులను ఇది సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.






