- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Russia: రష్యాకు భారీ షాక్.. బాంబు పేలుడులో న్యూక్లియర్ చీఫ్ మృతి
రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాస్కోలో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో ఆ దేశ న్యూక్లియర్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ ప్రాణాలు కోల్పోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా (Russia)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాస్కో(Mascow)లో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో ఆ దేశ న్యూక్లియర్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(Igore kirillow) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ (Russia investigate committee) వెల్లడించింది. కిరిల్లోవ్ తన అపార్ట్ మెంట్ నుంచి బయటకు వస్తుండగా ఇంటికి సమీపంలో పార్క్ చేసిన ఓ బైక్ పేలిపోయింది. దీంతో కిరిల్లోవ్ సహా మరొకరు మరణించినట్టు పేర్కొంది. రష్యా అధ్యక్ష భవనం అయిన క్రెమ్లిన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరగగా.. పేలుడు కోసం 300 గ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్టు తెలిపింది. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్టు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణులను ఘటనా స్థలానికి పంపినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ఆపరేషన్ సమయంలో నిషేధిత రసాయన ఆయుధాలను ఉపయోగించినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ సోమవారం కిరిల్లోవ్‌పై అభియోగాలు మోపింది. ఈ ప్రకటన వెలువడిన 24 గంటల వ్యవధిలోనే కిరిల్లోవ్ హతమవ్వడం గమనార్హం.
పేలుడు వెనుక ఉక్రెయిన్ హస్తం!
కిరిల్లోవ్‌ను హత్య వెనుక ఉక్రెయిన్ సెక్యురిటీ సర్వీసెస్ (Ukrein security services) హస్తం ఉందని పలు కథనాలు వెల్లడించాయి. ఆయనపై క్రిమినల్ విచారణ చేపట్టిన గంటల వ్యవధిలోనే హతమవడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ఈ ఘటనతో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత ఆందోళన కరంగా మారే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. కాగా, 2017లో రష్యా అణు దళాల చీఫ్‌గా కిరిల్లోవ్ నియమితులయ్యారు. అనంతరం రసాయన, జీవ ఆయుధాల విభాగాలకు చీఫ్‌గా పనిచేశాడు. ఈ హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా ప్రకటించింది.






