- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉక్రెయిన్‌పై 300 డ్రోన్లు, 30 మిసైల్స్‌తో రష్యా దాడి.. ఒకరు మృతి!
ఉక్రెయిన్‌పై 300 డ్రోన్లు, 30 మిసైల్స్‌తో రష్యా దాడి చేసిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా విరుచుకుపడింది. ఏకంగా 300 డ్రోన్లు, 30 క్రూయిజ్ మిసైల్స్‌తో రష్యా దాడులుచేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. పోర్ట్ సిటీ ఒడెసాపై 20 డ్రోన్లు, ఒక మిసైల్ దాడి జరిగిందని, ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించారని ఒడెసా మేయర్ హెన్నాదీ ట్రుఖనోవ్ వెల్లడించారు. ఇదే ప్రాంతంలో మరో ఆరుగురు గాయపడ్డారని, వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నారని జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ డిఫెన్స్‌ను పెంచాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్న ప్రపంచ లీడర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తమపై దాడి చేసిన 71 ఉక్రెయిన్ డ్రోన్లను తాము కూల్చేశామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మాస్కో సమీపానికి వచ్చిన 13 డ్రోన్లను కూల్చేసినట్లు మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. రష్యా దాడులు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు.






