బ్రిక్స్ సమావేశానికి రాని పుతిన్, జిన్‌పింగ్..!

by Phanindra |

బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ రాలేదు. పుతిన్‌పై ఐసీసీ అరెస్టు వారెంటు ఉండగా.. జిన్ ‌పింగ్ షెడ్యూల్ బిజీ అంటున్నారు.

బ్రిక్స్ సమావేశానికి రాని పుతిన్, జిన్‌పింగ్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో వేదికగా జరుగుతన్న బ్రిక్స్ సమావేశానికి రష్యా, చైనా అధ్యక్షులు హాజరుకాలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. బ్రెజిల్ వస్తే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో పుతిన్ ఈ సమావేశానికి రాలేదు. అలాగే 12 ఏళ్లలో తొలిసారి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా బ్రిక్స్ సమావేశాన్ని మిస్సయ్యారు. బిజీ షెడ్యూల్ వల్లే ఆయన రావట్లేదన్న చైనా.. జిన్‌పింగ్ బదులుగా లి కియాంగ్‌ను పంపింది. అయితే వచ్చే ఏడాది జరిగే బ్రిక్స్ మీటింగ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి అప్పుడైనా ఈ ఇద్దరు వరల్డ్ లీడర్స్ హాజరవుతారేమో చూడాలి. ఇక బ్రెజిల్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోడీ.. అక్కడి నుంచి నమీబియా పయనమవనున్నారు.

Next Story