పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం: రష్యా

by Phanindra |

పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని రష్యా ఆరోపించింది. 91 డ్రోన్లతో పుతిన్ నివాసంపై దాడి చేశారంది.

పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం: రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒకపక్క యుద్ధం ఆపేందుకు చర్చలు జరుగుతుంటే.. తమ దేశాధినేత పుతిన్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. నావ్గోరోడ్‌లోని పుతిన్ నివాసంపై 91 డ్రోన్లతో ఉక్రెయిన్ ఎటాక్ చేసిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ వెల్లడించారు. జెలెన్స్‌కీ-ట్రంప్ సమావేశం తర్వాత.. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు లావరోవ్ చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్.. దీన్ని ‘పిచ్చి చర్య’గా అభివర్ణించారని, జెలెన్స్‌కీతో యూఎస్ పనితీరుపై దీని ప్రభావం ఉంటుందని చెప్పినట్లు రష్యన్ మీడియా పేర్కొంది.

పచ్చిఅబద్ధాలు..: జెలెన్స్‌కీ

పుతిన్ నివాసంపై తాము దాడి చేసినట్లు వచ్చిన కథనాలను జెలెన్స్‌కీ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ పచ్చిఅబద్ధాలన్న ఆయన.. కీవ్‌లోని ప్రభుత్వ భవనాలపై దాడులు చేసేందుకు రష్యా సిద్ధం అవుతోందని, దానికోసమే ఇలా నిరాధార ఆరోపణలు చేసి కారణాలు చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. శాంతి చర్చలను ఉల్లంఘించి ప్రభుత్వంపై దాడిచేసేందుకే ఈ అబద్ధపు ప్రచారం చేస్తోందని రష్యాపై ఆయన మండిపడ్డారు.

Next Story