రీల్స్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

క‌ర్ణాట‌క రాష్ట్రం మండ్య జిల్లాలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్ బ‌స్ న‌డుపుతూ రీల్స్ చూశాడు. మ‌ళ‌వ‌ళ్లి-మైసూర్ మార్గంలో డ్రైవ‌ర్ బ‌స్సు న‌డుపుతూ రీల్స్ చూడ‌గా ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

రీల్స్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: క‌ర్ణాట‌క రాష్ట్రం మండ్య జిల్లాలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్ బ‌స్ న‌డుపుతూ రీల్స్ చూశాడు. మ‌ళ‌వ‌ళ్లి-మైసూర్ మార్గంలో డ్రైవ‌ర్ బ‌స్సు న‌డుపుతూ రీల్స్ చూడ‌గా ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. బ‌స్సు న‌డిపిన డ్రైవ‌ర్ మ‌హేశ్ గా గుర్తించారు. ర‌ద్దీగా ఉండే రోడ్డుపై బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తించిన డ్రైవర్ తీరుపై ప్ర‌యాణికులు మండిప‌డుతున్నారు.

ఇటీవ‌ల ఓ ర్యాపిడో బైక్ రైడ‌ర్ సైతం బైక్ న‌డుపుతూ రీల్స్ చూడ‌గా క‌స్ట‌మ‌ర్ దానిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో అత‌డిపై ర్యాపిడో చ‌ర్య‌లు తీసుకుంది. ఇక బైక్ అంటే కేవ‌లం ఒక వ్య‌క్తి కూర్చుంటారు. కానీ స‌బ్ లో దాదాపు 30 నుండి 50 మంది వ‌ర‌కు ప్ర‌యాణించే అవ‌కాశం ఉంది. ఆర్టీసీ బ‌స్ కాబ‌ట్టి ర‌ద్దీ మ‌రింత ఎక్కువ ఉండే అవ‌కాశం కూడా ఉంది. కాబట్టి నిర్ల‌క్ష్యం కార‌ణంగా జ‌ర‌గరానిది ఏదైనా జ‌రిగే పెద్దఎత్తున న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంది. దీంతో అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story