Flash News: ఆపరేషన్ సిందూర్‌‌పై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-09 10:06:57  IST  )

కేంద్రప్రభుత్వం, సాయుధ బలగాలకు అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ దేశ ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందని ప్రశంసిస్తూ మోహన్ భాగవత్, దత్తాత్రేయ హోసబలే పేర్లతో ప్రకటన విడుదల చేసింది.

Flash News: ఆపరేషన్ సిందూర్‌‌పై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 26 మంది మరణించిన ఘటన యావత్ దేశాన్నీ కలచివేసింది. పాక్ పై ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోయాడు. హిందూ యాత్రికులే టార్గెట్ గా జరిగిన ఈ దాడి అందరినీ కలచివేసింది. ఈ దారుణంపై భారత్ "ఆపరేషన్ సిందూర్"తో రివేంజ్ తీర్చుకుంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లలో (POK) ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి సుమారు 100 మంది ఉగ్రమూకల్ని మట్టుపెట్టింది. ఈ పరిణామాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) X వేదికగా కీలక ప్రకటన చేసింది.

కేంద్రప్రభుత్వం, సాయుధ బలగాలకు అభినందనలు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ దేశ ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందని ప్రశంసిస్తూ మోహన్ భాగవత్, దత్తాత్రేయ హోసబలే పేర్లతో ప్రకటన విడుదల చేసింది. దేశ భద్రత కోసం పాక్ పై దాడి తప్పనిసరి అని ఆ లేఖలో ఆర్ఎస్ఎస్ పేర్కొంది. ప్రజలందరూ దేశభక్తిని ప్రదర్శించాలని, సైన్యం, కేంద్రానికి సహకరించాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే, వ్యతిరేక పనులు చేసే విద్రోహశక్తులకు అడ్డుగా నిలబడాలని, సైన్యం మనకోసం ప్రాణాలు అర్పిస్తుంటే.. వారి ధైర్యాన్ని అభినందించడంతో పాటు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చింది. శాంతిగా ఉండటం అంటే.. క్షమాపణ కాదని, న్యాయం జరిగేలా చూడటమని తెలిపింది.

Next Story