హిందువులు ముగ్గురు పిల్లలను కనాలి: మోహన్ భాగవత్

by velandi.Saikiran |

హిందువులు ముగ్గురు పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

హిందువులు ముగ్గురు పిల్లలను కనాలి: మోహన్ భాగవత్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ( RSS Chief Mohan Bhagwat ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఐక్యత, హిందూ ధర్మం కోసం ముఖ్యం పోరాటం చేసే మోహన్ భాగవత్, తాజాగా పిల్లల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు ముగ్గురు పిల్లలను కచ్చితంగా కనాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ చేశారు మోహన్ భాగవత్. మంగళవారం లక్నోలో ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇండియాలో హిందువుల జనాభా క్రమ క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో కనీసం ముగ్గురు పిల్లలను హిందువులు కనాల్సిందేనని పిలుపునిచ్చారు.

లేకపోతే హిందూ ధర్మం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాలని..ఆ అవసరం ఇప్పుడు కచ్చితంగా ఉందన్నారు. హిందువులను శక్తివంతం చేయాల్సిన పని ముందు పెట్టుకున్నట్లు వివరించారు. ఇప్పుడు ఎలాంటి ముప్పు హిందువులకు లేదు, కానీ అప్రమత్తత చాలా అవసరమని వ్యాఖ్యానించారు. చొరబాటుదారులను గుర్తించి పంపేయాలని... వాళ్లకు ఉపాధి కల్పించకూడదని ప్రభుత్వాన్ని కోరారు. అలాంటి అక్రమ చొరబాటుదారుల వల్ల హిందువులకు నష్టం కలిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు కూడా చెప్పారు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా ముగ్గురు పిల్లలను కనాలని మోహన్ భాగవత్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story