సరిహద్దుల్లో దుష్టశక్తుల కుట్రలు చూస్తున్నాం: మోహన్ భగవత్

by Phanindra |

సరిహద్దుల్లో దుష్టశక్తుల కుట్రలు చూస్తున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కాబట్టి దేశాన్ని శక్తిమంతంగా చేయాలని సూచించారు.

సరిహద్దుల్లో దుష్టశక్తుల కుట్రలు చూస్తున్నాం: మోహన్ భగవత్
X

దిశ, నేషనల్ బ్యూరో: దుష్టశక్తులన్నీ కలిసి వచ్చినా ఓడించలేని స్థాయికి భారత్‌ను తీసుకెళ్లాలని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే ఈ బలంతోపాటు దేశంలో విలువలు కూడా పెరగాలని, ఒక దిశ లేని బలం క్రూరత్వానికి దారి తీస్తుందని హెచ్చరించారు. సరిహద్దుల్లో అన్ని వైపులా దుష్టశక్తుల కుట్రలు ఎదుర్కొంటున్న సమయంలో శక్తిమంతంగా తయారవడం తప్ప భారత్‌కు మరో మార్గం లేదని ఆయన చెప్పారు. దేశ భద్రత కోసం భారత్ ఎవరిపైనా ఆధారపడ కూడదని, నిజమైన బలం దేశం లోపలి నుంచే రావాలని అన్నారు. మంచి వ్యక్తి కేవలం మంచి వాడవడం వల్ల భద్రంగా ఉండలేడని చెప్పిన ఆయన.. మంచి గుణాలతోపాటు శక్తి కూడా అవసరమని, అదే సమయంలో ఈ శక్తితోపాటు విలువలు కూడా ఉండాలని సూచించారు. విలువలు లేని బలం క్రూరత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు.

Next Story