- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSS: ఈసారి వీర్ సావర్కర్కు భారతరత్న పక్కా? మోహన్ భగవత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆర్ఎస్ఎస్ చీఫ్ గా తన పదవీ విరమణపై మోహన్ భగవత్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో మరోసారి వీర్ సావర్కర్కు (Veer Savarkar) భారతరత్న పురస్కారం అంశం చర్చనీయాంగా మారింది. సావర్కర్‍కు భారతరత్న ఇస్తామని చాలా కాలంగా బీజేపీ చెబుతూ వస్తుండగా తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆదివారం ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ (Mohan Bhagwat) మాట్లాడుతూ.. వీర్ సావర్కర్కు భారతరత్న పురస్కారం ఇస్తే దాని ప్రతిష్ఠ పెరుగుతుందని అన్నారు. దీంతో సావర్కర్‍కు భారతదేశ అత్యున్న పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనే బీజేపీ డిమాండ్‍కు భగవత్ తాజా వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లైందనే చర్చ జరుగుతోంది.
సావర్కర్‍కు భారతరత్న ఖాయమేనా?:
భారత రత్న పురస్కారాలను కేంద్రం చివరగా 2024లో ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఎవరికి ప్రకటించలేదు. నిజానికి సావర్కర్‍కు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచే ఈ డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈయనకు భారతరత్న (Bharat Ratna) ఇస్తామంటూ మహారాష్ట్రలో మేనిఫెస్టోలో ఈ అంశాన్ని బీజేపీ పొందుపరిచింది. ఆతర్వాత మోడీ, అమిత్ షా తోపాటు పలువుకు కేంద్ర మంత్రులు నేరుగా ప్రకటనలు చేశారు. బీజేపీ చేసిన ప్రకటనపై అప్పట్లో రాజకీయ రగడ ప్రారంభమైంది. బీజేపీ ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. గాంధీ హత్యలో ఆయన ప్రయేయం ఉందంటూ కాంగ్రెస్ విమర్శించగా వీర్ సవార్కర్ కృషి వల్లే 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం చరిత్రలో నిలిచిందంటే అది సావర్కర్ రచనల కృషి అంటూ బీజేపీ సమర్ధించుకుంటూ వస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో సావర్కర్‍కు దేశంలోనే అత్యున్నత పురస్కారం ఇవ్వడం ఖాయం అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో ఈ సారి సావర్కర్‍కు భారతరత్న ఖాయమేనా అనే టాక్ వినిపిస్తోంది.
రిటైర్మెంట్ పై..
ముంబయి కార్యక్రమంలో మాట్లాడిన మోహన్ భగవత్ తన రిటైర్మెంట్‍పై కూడా స్పందించారు. నాకు 75 ఏళ్లు నిండాయని ఈ విషయాన్ని తాను సంఘ్ కు తెలియజేస్తే యథావిధిగా కొనసాగాలని సంఘ్ కోరిందన్నారు. వయసుతో సంబంధం లేకుండా పనిని కొనసాగించాలని కోరిందని, పదవి నుంచి వైదొలగాలని ఎప్పుడు కోరినా అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కానీ పని నుంచి మాత్రం ఎప్పటికీ విరమణ ఉండదని, ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఎవరినైనా పదవీ విరమణ చేయించాల్సిన పరిస్థితి రాలేదన్నారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని ఉమ్మడి పౌరస్మృతి రూపొందించాలని అది విభేదాలకు దారితీయకూడదని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ పనితీరులో ఇంగ్లీష్ ఎప్పటికీ కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉండదని అది భారతీయ భాష కాదన్నారు. అయితే మేము ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని అవసరమైన చోటల్లా మేము దానిని ఉపయోగిస్తామని చెప్పారు. సంఘ్ పని ప్రచారం చేయడం గురించి కా






