Delhi polls : నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500.. అనౌన్స్ చేసిన కాంగ్రెస్

by Sathputhe Rajesh |

ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో పథకాన్ని ప్రకటించింది.

Delhi polls : నిరుద్యోగ యువతకు నెలకు రూ.8,500.. అనౌన్స్ చేసిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ మరో పథకాన్ని ప్రకటించింది. గెలిస్తే ‘యువ ఉద్ధాన్ యోజన’ పేరిట నిరుద్యోగ యువతకు నెలకు రూ.8500ల చొప్పున ఏడాది పాటు అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయా కంపెనీల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పథకాన్ని వర్తిపంజేస్తామన్నారు. కాంగ్రెస్ ఈనెల 6న ‘ప్యారీ దీదీ యోజన’ కింద రూ.2,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నెలలోనే జీవన్ ‘రక్ష యోజన’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంతో రూ.25లక్షల హెల్త్ ఇన్యూరెన్స్‌ ఫ్రీగా పొందవచ్చు. కాగా ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఆయా పార్టీల భవితవ్యం తేలనుంది.

Next Story