- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీరువాల్లో నోట్ల కట్టలు.. లెక్కించలేక ఆగిపోతున్న యంత్రాలు
ఐటీ దాడుల్లో భాగంగా మద్యం వ్యాపారస్తుల బీరువాల్లో నోట్ల కట్టలు చూసి అధికారులే కంగుతిన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ దాడుల్లో భాగంగా మద్యం వ్యాపారస్తుల బీరువాల్లో నోట్ల కట్టలు చూసి అధికారులే కంగుతిన్నారు. పైగా ఆ డబ్బును లెక్కించేందుకు యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆ స్థాయిలో ఇనుప పెట్టల్లో నోట్ల కట్టలున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వివిధ లిక్కర్ తయారీ సంస్థలకు సంబంధించిన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బుధవారం దాడులు నిర్వహించి దాదాపు రూ.200 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణలపై ఎంఎస్ శివ గంగా అండ్ కంపెనీ, బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా అరడజనుకు పైగా సంస్థలల్లో, ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి.
Next Story






