- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UP : రూ.80 కోట్ల బకాయిలు.. పరారైన టర్కీ సంస్థ
చెల్లించాల్సిన రూ.80 కోట్ల బకాయిలను ఎగ్గొట్టి దేశం విడిచి పరారైంది ఓ తుర్కియే సంస్థ.

దిశ, వెబ్ డెస్క్ : చెల్లించాల్సిన రూ.80 కోట్ల బకాయిలను ఎగ్గొట్టి దేశం విడిచి పరారైంది ఓ తుర్కియే సంస్థ. ఉత్తరప్రదేశ్(UP) లోని కాన్పూర్ మెట్రో ప్రాజెక్టు(Kanpur Metro Project)లో పనిచేస్తున్న టర్కీ సంస్థ గులెర్మాక్(Turkish company Gulermak), 53 మంది కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన దాదాపు రూ.80 కోట్ల బకాయిలు ఇవ్వకుండా నగరం విడిచి పరారైంది. ఈ సంస్థ గత 10 నెలలుగా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో(Bharat-Pak War) టర్కీ పాత్రపై దేశవ్యాప్తంగా నిరసనలు జరగడంతో ఈ బకాయిలు మరింత ఆలస్యమయ్యాయి. కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా, ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (UPMRC) ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీంతో 9 మంది కాంట్రాక్టర్లు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గులెర్మాక్ సంస్థ అధికారులు నగరం వదిలి వెళ్లిపోయారని, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. UPMRC ప్రకారం, గులెర్మాక్‌కు కాన్పూర్‌లోని నాలుగు స్టేషన్ల పనిని పూర్తి చేసినందుకు పూర్తి చెల్లింపులు చేశారు. ఈ కాంట్రాక్టర్లు గులెర్మాక్‌కు సబ్-కాంట్రాక్టర్లుగా పనిచేసినవారు. సంస్థ చెల్లింపులు చేయకపోతే, UPMRC వద్ద ఉన్న 5% రిజర్వ్ చెల్లింపులను విడుదల చేయాల్సి ఉంటుంది.






