- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rs 700 crore loan fraud : కువైట్‌లో రూ.700కోట్ల బ్యాంకు లోన్ ఫ్రాడ్..
కువైట్‌కు చెందిన పలు బ్యాంకుల ఫిర్యాదులతో కేరళలో ఆయా పోలీసు స్టేషన్‌లలో పది ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో : కువైట్‌కు చెందిన పలు బ్యాంకుల ఫిర్యాదులతో కేరళలో ఆయా పోలీసు స్టేషన్‌లలో పది ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. వీరంతా బ్యాంకుల నుంచి రూ.10.21 కోట్లు రుణాలు తీసుకున్నట్లు కంప్లైంట్‌లో తెలిపాయి. ఎక్కువగా ఇండియాకు చెందిన నర్సులు లోన్ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు బ్యాంకులు స్పష్టం చేశాయి. కువైట్‌లోని ఆయా బ్యాంకుల నుంచి లోన్లు పొంది.. తర్వాత లీవ్‌పై ఇండియాకు వచ్చి రుణాలు చెల్లించడం లేదని బ్యాంకులు పేర్కొన్నాయి. లోన్లు తీసుకున్న వారిలో ఎక్కువ మంది కెనడా, యూరోప్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కువైట్ బ్యాంకుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను ట్రేస్ చేసి పది ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇండియాకు చెందిన 1,425 మంది భారతీయులు రూ.700 కోట్ల వరకు రుణాలు తీసుకుని చెల్లించడం లేదని కువైట్‌లోని గల్ఫ్ బ్యాంకు తెలిపింది. లోన్లు తీసుకున్న వారిలో ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నట్లు పేర్కొంది. కేసును ఒక్కొక్కటిగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లోన్లు తీసుకున్న వారంతా ప్రస్తుతం భారతదేశ పౌరులుగా కొనసాగుతున్నారా? లేదా? తేలాల్సి ఉందన్నారు.






