రూ. 55 వేల కోట్లు నీటి పాలు.. దానిని హైలైట్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!!

by Sujitha Rachapalli |

ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే (హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్) నిర్మాణానికి 55వేల కోట్లు ఖర్చయింది. ఓపెన్ చేసి కేవలం ముప్పై రోజులు మాత్రమే అయింది. కానీ వర్షాల కారణంగా..

రూ. 55 వేల కోట్లు నీటి పాలు.. దానిని హైలైట్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్!!
X

దిశ, వెబ్‌డెస్క్ : ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే (హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్) నిర్మాణానికి 55వేల కోట్లు ఖర్చయింది. ఓపెన్ చేసి కేవలం ముప్పై రోజులు మాత్రమే అయింది. కానీ వర్షాల కారణంగా.. బుల్ధానా జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌వే ఒక భాగం నీటమునిగింది. నదిని తలపిస్తోంది. 24 గంటలు నిర్విరామంగా కురిసిన వర్షానికి.. మెహ్కర్ తాలూకాలోని సబ్రా-ఫర్దాపూర్ ఇంటర్‌చేంజ్ సమీపంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

ఎక్స్‌ప్రెస్‌వే కింద ఉన్న జాతీయ రహదారి 548C (మెహ్కర్-ఖామ్‌గావ్ రూట్)లో 200 మీటర్ల విస్తీర్ణంలో నీరు నిలిచింది. ఈ నీరు ఎక్స్‌ప్రెస్‌వే ర్యాంప్‌లలోకి కూడా ప్రవేశించింది. దీని వల్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇంజన్‌లలో నీరు చేరడంతో అనేక వాహనాలు స్తంభించాయి. సుమారు రెండు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగగా.. అత్యవసర డ్రైనేజీ చర్యలతో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. కాగా ఈ సంఘటన ఎక్స్‌ప్రెస్‌వే డ్రైనేజీ వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్‌ప్రెస్‌వే నదిగా మారిందనే న్యూస్ షేర్ చేస్తూ డిజైన్ లోపాలను హైలైట్ చేస్తున్నారు నెటిజన్లు. 55వేల కోట్లు నీటి పాలయ్యాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

VIDEO

Next Story