మార్కెట్లోకి నకిలీ నోట్లు.. అసలైన వాటిలా రూ. 500 నోట్లు.. ఎలా గుర్తించాలంటే? : హోంశాఖ

by Ramesh Naini |

మార్కెట్‌లో నకిలీ నోట్లు చెలమణి అవుతున్నాయి జాగ్రత్త అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది.

మార్కెట్లోకి నకిలీ నోట్లు.. అసలైన వాటిలా రూ. 500 నోట్లు.. ఎలా గుర్తించాలంటే? : హోంశాఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్కెట్‌లో (Fake currency) నకిలీ నోట్లు చెలమణి అవుతున్నాయి జాగ్రత్త అని (Union Home Ministry) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించింది. మార్కెట్లోకి వచ్చిన సరికొత్త రూ. 500 నోట్లతో జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నకిలీ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు ఉందని అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రజలు, వ్యాపార సంస్థలు గమనించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని 'RESERVE BANK OF INDIA' రిజర్వ్ 'RESERVE' అనే చోట E అక్షరం బదులు A ముద్రించారని హోంశాఖ పేర్కొంది. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ తప్పును గుర్తించలేరని వెల్లడించింది. ఈ విషయంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేశామని కేంద్ర హోం శాఖ తెలియజేసింది.

దీనికి సంబంధించి సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించింది. ఈ నకిలీ నోట్ల ముద్రణ, వాటి నాణ్యత, అసలైన నోట్లను తలపించేలా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటి ఖచ్చిత సంఖ్యను గుర్తించడం చాలా కష్టమైన పని అని ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహిస్తున్న ఓ అధికారి వెల్లడించారు.

Next Story