- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై రూ.2.83 కోట్ల లిక్విడ్ క్యాష్.. బ్యాగులు చెక్ చేసిన పోలీసులకు మైండ్‌బ్లాంక్!
ఇండోర్-ఉజ్జయిని హైవేపై మూడు లగేజీ బ్యాగుల్లో రూ.2.83 కోట్ల విలువైన రూ.500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్ జిల్లాలోని సాన్వేర్-ఉజ్జయిని (Sanver-Ujjain) రహదారిపై ఇవాళ ఉదయం 3 అనుమానాస్పద బ్యాగులు లభ్యమయ్యాయి. స్థానిక రైతు భుట్టా (Bhutta) చౌరస్తా సమీపంలోని చెట్టు కింద ఈ బ్యాగులను చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్పాట్‌కు చేరుకున్న పోలీసులు బ్యాగులను తెరిచి చూడగా, అందులో వందలాది రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఆ మొత్తం దాదాపు రూ.2.83 కోట్లు ఉంటుందని భావించారు. అయితే, ఆ కట్టలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. ఆ కట్టల్లో కేవలం పైన, కింద మాత్రమే అసలు నోట్లు ఉండగా, మధ్యలో కేవలం రంగు కాగితాలు, నకిలీ నోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 566 నోట్ల కట్టల్లో కేవలం 84 నోట్లు మాత్రమే అసలైనవని అసలుగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల అనుమానం..
ఎవరైనా పెద్ద ఎత్తున మోసానికి (Fraud) పాల్పడటానికి, ఎవరినైనా తప్పుదోవ పట్టించడానికి ఈ ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఈ బ్యాగులను చూసి అవి నిజమైన నగదు అని నమ్మేలా పక్కా ప్లాన్ సిద్ధం చేశారని అదనపు ఎస్పీ రూపేష్ కుమార్ ద్వివేది తెలిపారు. ఈ మేరకు నిందితులను పట్టుకునేందుకు హైవేపై ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ బ్యాగులను అక్కడ ఎవరు వదిలి వెళ్లారు.. వారి ఉద్దేశం ఏంటి? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.






