400 మీటర్ల ప్రయాణానికి రూ.18 వేలు.. భార‌తీయుల ప‌రువు తీస్తున్నారుగా!

by Ajay Maddhiboyina |

ముంబైలో అమెరికా ప‌ర్యాట‌కురాలికి చేదు అనుభ‌వం ఎదురైంది. కేవ‌లం 400 మీట‌ర్ల దూరం ప్ర‌యాణానికి ఓ టాక్సీ డ్రైవ‌ర్ రూ.18వేలు వ‌సూలు చేశాడు.

400 మీటర్ల ప్రయాణానికి రూ.18 వేలు.. భార‌తీయుల ప‌రువు తీస్తున్నారుగా!
X

దిశ‌, వెబ్ డెస్క్: ముంబైలో అమెరికా ప‌ర్యాట‌కురాలికి చేదు అనుభ‌వం ఎదురైంది. కేవ‌లం 400 మీట‌ర్ల దూరం ప్ర‌యాణానికి ఓ టాక్సీ డ్రైవ‌ర్ రూ.18వేలు వ‌సూలు చేశాడు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన ప‌ర్యాట‌కురాలు దీనిపై ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్టింది. త‌న పోస్ట్ లో.. ముంబై విమానాశ్ర‌యం నుండి ఓ స్టార్ హోట‌ల్ వెళ్లేందుకు టాక్సీ బుక్ చేసుకున్న‌ట్టు తెలిపింది. హోట‌ల్ వ‌ద్ద దిగిన త‌ర‌వాత టాక్సీ డ్రైవ‌ర్ దేవ‌రాజ్ యాద‌వ్ రూ.18వేలు డిమాండ్ చేసిన‌ట్టు పేర్కొంది. విమానాశ్ర‌యం నుండి హోట‌ల్ కేవ‌లం 400 మీట‌ర్ల దూరం మాత్ర‌మే ఉంద‌ని కానీ 18వేలు వ‌సూలు చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

బాధిరాలి ట్వీట్ వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు పోలీసుల‌కు ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు అత‌డి ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇక ప్ర‌స్తుతం అమెరికా మ‌హిళ ట్వీట్ నెట్టింట్ వైర‌ల్ అవుతూ ఉండ‌గా నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఇలాంటి ప‌నుల వ‌ల్ల‌నే ఇండియా ప‌రువు పోతోంద‌ని అంటున్నారు. ఇలాంటివి రిపీట్ అవ్వ‌డం వ‌ల్ల దేశానికి రావాలంటే టూరిస్టులు భ‌య‌ప‌డిపోతార‌ని త‌ర‌వాత వ‌చ్చే ఆదాయం కూడా రాకుండా పోతుంద‌ని ఫైర్ అవుతున్నారు. అవ‌స‌రం ఉంటే టిప్ అడ‌గాల‌ని కానీ వ‌చ్చిన అతిధుల వ‌ల్ల ఇష్టం వ‌చ్చినట్టు డ‌బ్బులు వ‌సూలు చేయ‌వ‌ద్ద‌ని మండిప‌డుతున్నారు.

Next Story