- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
L2: ఎంపురాన్ చిత్ర నిర్మాత కార్యాలయాల్లో సోదాలు.. రూ.1.5 కోట్లు స్వాధీనం
తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. L2: ఎంపురాన్ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ కు చెందిన కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు, కేరళలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. L2: ఎంపురాన్ చిత్ర నిర్మాత గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ కు చెందిన కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయనకు శ్రీ గోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ (గోకుల్ చిట్ ఫండ్) కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ రూ.1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీలకు గోకులం గోపాలన్ అలియాస్ ఏఎం గోపాలన్ యాజమానిగా ఉన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద రూ.1,000 కోట్ల విలువైన స్కాం దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏఎం గోపాలన్ సంస్థ తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మరోవైపు, గోకుల్ చిట్స్ లో తనిఖీలు ఇదేం మొదటిసారి కాదు. ఏప్రిల్ 2017లో ఆదాయపు పన్ను శాఖ మూడు రాష్ట్రాల్లోని గోకుల్ చిట్స్ ప్రాంగణంలో సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో భాగంగా సోదాలు చేపట్టింది. ఐదేళ్లలో రూ. 1,107 కోట్లను వెల్లడించకపోవడం ద్వారా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించకుండా ఉండవచ్చని ఆ సమయంలో అధికార వర్గాలు తెలిపాయి.






