Viral: బాప్ రే.. ఇంజనీర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. విజిలెన్స్ రాకతో కిటికిలో నుంచి..

by Prasad Jukanti |   (  Updated:2025-05-30 12:06:08  IST  )

విజిలెన్స్ తనిఖీల్లో అవినీతి అధికారి లంచావతారం షాకింగ్ కు గురి చేసింది.

Viral: బాప్ రే.. ఇంజనీర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. విజిలెన్స్ రాకతో కిటికిలో నుంచి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొంత మంది అవినీతి అధికారుల బుద్ధి మారడం లేదు. వారి అవినీతి (Corruption) దాహానికి అంతు ఉండటం లేదు. తాజాగా ఒడిశాలోని (Odisha) ఓ ఇంజినీరింగ్ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రెయిడ్స్ విషయం తెలుసుకున్న సదరు అధికారి ఇంట్లో దాచుకున్న నగదును కిటికీల్లోంచి బయటకు విసిరివేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న బైకుంత నాథ్ సారంగి ఇంట్లో విజిలెన్స్ (Vigilance) అధికారులు రెయిడ్స్ నిర్వహించారు. అతడికి సంబంధించిన ఇళ్లు, బంధువులు ఇళ్లు కలిపి మొత్తం 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బైకుంత నాథ్ అవినీతి దాహం ఎంతలా పాతుకుపోయిందో చూసి అధికారులు షాక్ తిన్నారు. తనిఖీల కోసం అధికారులు అంగుల్ లోని కరడిగాడియాకు రావడం గమనించిన బైకుంత నాథ్ వెంటనే తన రెండంతస్తుల బిల్డింగ్ లో దాచుకున్న నోట్ల కట్టలను కిటికిలో నుంచి బయటకు విసిరేశాడు. అతడి బాగోతం అంతా గమనించిన అధికారులు ఆ నోట్లకట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.1 కోట్లు ఉందని భువనేశ్వర్ లోని ఇంకో ఫ్లాట్ లో మరో కోటి రూపాయల నగదు దొరికినట్లు అధికారులు తెలిపారు. అతడి ఇంట్లో లభించిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story