- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rozgar Mela:15వ రోజ్‌గార్ మేళా.. 51,000 మందికి నియామకపత్రాల పంపిణీ
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 51,236 మందికి ప్రధాని మోడీ నియామకపత్రాలను అందజేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: 15వ రోజ్ గార్ మేళా (Rozgar Mela) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 51,236 మందికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా 47 ప్రదేశాల్లో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశంలో యువతకు అనేక అవకాశాలున్నాయని తెలిపారు. దేశంలో స్వయం ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతూనే ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ‘యువత కొత్త బాధ్యతలు చేపట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, అంతర్గత భద్రత, ప్రజల సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యువత ఎంత అంకితభావంతో ఉంటే, అంత వేగంగా వికసిత్ భారత్ సాధ్యం అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
స్కిల్ ఇండియా (Skill india), స్టార్టప్ ఇండియా (Startup india), డిజిటల్ ఇండియా (Digital india) వంటి కార్యక్రమాలు ఆవిష్కరణ, ప్రతిభకు వెలికి తీయడానికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. ఈ ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షలో ఐదుగురు టాపర్లలో ముగ్గురు మహిళలు ఉండటం ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వా్మ్యం పెరగడం గొప్ప విషయమన్నారు. 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్లకు పైగా మహిళలు పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, 14వ రోజ్ గార్ మేళాలో 71,000 మందికి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు.






