King Charles III: త్వరలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతుల భారత పర్యటన

by S Gopi |

నెల రోజుల క్రితం కూడా వారు చికిత్స నిమిత్తం రహస్య పర్యటన చేశారు.

King Charles III: త్వరలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతుల భారత పర్యటన
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ రాజు, కింగ్ ఛార్లెస్-3 దంపతులు త్వరలో మరోసారి భారత్‌‌కు రానున్నారు. బెంగళూరులోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్‌ అనే వెల్‌నెస్ సెంటర్​‌లో కింగ్ ఛార్లెస్ 3 దంపతులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం కూడా వారు చికిత్స నిమిత్తం రహస్య పర్యటన చేశారు. ఆస్ట్రేలియా, సమోవా నుంచి తిరిగి వస్తూ నెలరోజుల క్రితం బెంగుళూరులోని ఒక వెల్నెస్ రిసార్ట్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అయితే ఈసారి పర్యటన అధికారికంగా జరగనుందని యూకే మీడియా పేర్కొంది. డైలీ మిర్రర్ ప్రకారం, 2022 సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్2 మరణించిన కారణంగా ఆ సమయంలో కింగ్ చార్లెస్ 3 విస్తృత పర్యటన రద్దు చేసుకున్నారు. దాంతో ఈసారి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కింగ్ చార్లెస్ భారత పర్యటన ప్రపంచ వేదికపై రాజకీయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బకింగ్‌జామ్ ప్యాలెస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కింగ్ చార్లెస్3కి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారించింది. వచ్చే ఏడాదిలోనూ విదేశీ పర్యటన ఉండనున్నట్టు సమాచారం.

Next Story